ఆ పార్టీ నేతల్లో ఓ వైపు గెలుపు పై ధీమా..మరో వైపు టెన్షన్!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే 13వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-23 07:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే 13వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అన్ని పార్టీల నేతలు ఈ ఎన్నికల్లో గెలుపొందాలని విశ్వప్రయత్నాలు చేశారు. పోలింగ్ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు ఓటముల పై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అని ప్రధాన పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ధీమా వ్యక్తం చేసిన వైసీపీ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది అని ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పైకి గెలుస్తామని ఓవైపు ఎన్డీయే కూటమి, మరోవైపు వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నా..లోపల ఎక్కడో ఓటమి భయం పట్టుకుందట. ముఖ్యంగా ఈ ఓటమి భయం అధికార పార్టీలో కొంచెం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం అనుకూల ఓటు కంటే..వ్యతిరేక ఓటింగ్ ఎక్కువగా జరిగిందనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందో జూన్ 4వ తేదీన తేలిపోనుంది.

Similar News