పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై అధికారిక ప్రకటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఉత్కంఠ వీడింది. తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.

Update: 2024-03-14 09:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై సందిగ్ధత వీడింది. తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తుది జాబితాపై కసరత్తుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని అన్నారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి జగన్ తోకను కత్తిరించబోతున్నామని వెల్లడించారు. కాగా, పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించగానే.. అభిమానులంతా గాజువాక లేదా తిరుపతి, భీమవరం నుంచి పోటీ చేయాలని అరుపులు కేకలతో హోరెత్తించారు. మరోవైపు గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News