మరో గుడ్ న్యూస్.. ఆ వడ్డీ మాఫీ

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తెలిపారు....

Update: 2024-03-06 10:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తెలిపారు. 2023-2024 ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆస్తి పన్ను మాత్రమే ప్రజలు కడితే సరిపోతుందని సీఎం జగన్ తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలు కట్టాల్సిన పన్ను బకాయిలపై ఒకే విడతలో వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31లోపు విడతల వారీగా గాని, ఒకే సారి ఆస్తి పన్ను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వడ్డీ చెల్లించినట్లతే సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు. దీంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆస్తి పన్ను బకాయిలు క్లియర్ చేస్తున్నారు. 

Similar News