AP:చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్..వైసీపీ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలో కొనసాగబోదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-23 09:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలో కొనసాగబోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర ఓటమి తప్పదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌పై తాజాగా వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆయన అంచనాలు తప్పు అని నిరూపితమయ్యాయి. చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్ఠార్‌గా ప్రశాంత్ కిషోర్ మారారు అని రాసుకొచ్చింది. 2022 లో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఓటమి ఖాయమని ఆయన వేసిన అంచనా తప్పిందంటూ కరణ్ థాపర్ ఆధారాలతో ప్రశ్నించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో జూన్ 4వ తేదీన తేలిపోనుంది.

Similar News