Breaking: సీఎం జగన్ లండన్ టూర్‌పై తీర్పు వాయిదా

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పటిషన్‌పై తీర్పు వాయిదా పడింది...

Update: 2024-05-09 07:07 GMT

దిశ, వెబ్ డెస్క్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. దీంతో సీబీఐ లాయర్లు అభ్యంతరం చెప్పారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొదని ధర్మాసనాన్ని కోరారు. గతంలో కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్లు గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.

కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే లండన్ వెళ్లేందుకు సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More..

మళ్లీ గెలిస్తేనే పథకాలు.. లేకపోతే అంతే..?: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News