ఆ తిట్లను మోడీ అంతా తేలిగ్గా మర్చిపోరు బాబు: MP Vijaya Sai Reddy సెటైరికల్ ట్వీట్

ప్రధాని మోడీతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

Update: 2022-12-06 12:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ''చంద్రం! ప్రధాని వెనుక పరుగెత్తుకుంటూ వెళ్లి నమస్కరిస్తే.. సంస్కారం కొద్దీ ఆయన పలకరించారు నిన్ను. నువ్వు చేసిన హేళనలు, తిట్టిన తిట్లు అంత తేలిగ్గా మర్చిపోయేంత మతిమరుపు ఏమీ లేదు మోదీ గారికి. నిమిషం ఎదురుగా నిల్చుంటే ఎన్ని కథలు అల్లుతున్నార్రా ఎల్లో మీడియా కులగజ్జి కేటుగాళ్లు'' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మరో ట్వీట్‌లో ''పీఎం గారు నీ బరువు తగ్గిందన్నారా? బలుపు తగ్గిందన్నారా చంద్రం అన్నయ్యా? ఏది తగ్గినా నీ 'ప్రచార యావ' మాత్రం తగ్గలేదు...ఏం ఎలివేషన్స్ 'బాబన్నయ్యా'! పులిహోరా, దద్దోజనం బాగా కలపండి'' అంటూ సెటైర్లు వేశారు.

ఇక, భారత్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే జీ–20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఈ సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మొత్తం అన్ని రాష్ట్రాల సీఎంలను, 40 పార్టీల ప్రెసిడెంట్‌లకు ఆహ్వానం పంపించారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కూడా ఆహ్వనించారు. సోమవారం జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్‌తో పాటు.. చంద్రబాబు కూడా హాజరవ్వడం గమనార్హం. ఈ సమావేశం సందర్భంగానే ప్రధాని మోడీతో చంద్రబాబు మాట్లాడారు.  

Read more:

నీతి ఆయోగ్ సీఈవో‌తో చంద్రబాబు భేటీ 

Tags:    

Similar News