Visakha Summit: వెల్లువెత్తుతున్న రిజిస్ట్రేషన్లు.. 12 వేలు దాటిన దిగ్గజ కంపెనీలు

సీఎం జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం శుక్ర, శనివారాల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గొప్ప వేదికని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు....

Update: 2023-03-02 14:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం శుక్ర, శనివారాల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గొప్ప వేదికని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో చేస్తున్న ప్రయత్నాలు అలాగే ప్రజలు అందిస్తున్న సహకారం దేశ, ప్రపంచ వ్యాప్త పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు ప్రేరేపిస్తాయని అన్నారు. అందరం కలిసి సమిష్టిగా అభివృద్ధి చెందుదామన్నదే జీఐఎస్ నినాదమని తెలిపారు.  

జీఐఎస్‌కు తరలివస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు

విశాఖ జీఐఎస్ కు పారిశ్రామిక దిగ్గజాలు తరలివస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ప్రత్యేక అతిథులుగా అంబానీ, బిర్లా, అదానీ, బజాజ్, జిందాల్, భజాంకా, దాల్మియా, బంగర్ తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారని తెలిపారు. వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాయంత్రం నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య 12000 దాటిందని, ఈ సంఖ్య మరింత పెరగనుందని విజయసాయి తెలిపారు.

Tags:    

Similar News