ఏపీలో మరోసారి వైసీపీదే పవర్.. ఫలితాల ముందే జోస్యం చెప్పిన మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. దీంతో జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం ప్రధాన

Update: 2024-05-24 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. దీంతో జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం ప్రధాన పార్టీలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని అటు రాజకీయ నేతలతో పాటు ఇటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. లోలోపల ఎలా ఉన్నా.. అన్ని పార్టీలు మాత్రం బయటకు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ కీలక నేత, మంత్రి బొత్స సత్యానారాయణ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్ నేతృత్వంలోని వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. జూన్ 9న విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో వైసీపీ గెలుస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పేదవాళ్లు అంటే చంద్రబాబుకు నచ్చదని మండిపడ్డారు. ప్రతి విషయంలో చంద్రబాబు లేఖలు రాస్తూనే ఉన్నారని, ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేసినచోటే అల్లర్లు జరిగాయని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగసిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. 

Read More..

టీడీపీకి వచ్చే సీట్ల సంఖ్య ఇదే..వెరైటీగా జోస్యం చెప్పిన వైసీపీ ఎంపీ!! 

 

Similar News