మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

జూన్ 9న సీఎం జగన్ ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు...

Update: 2024-05-24 14:47 GMT

దిశ, వెబ్ డెస్క్: జూన్ 9న సీఎం జగన్ ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయగనరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఐఏఎస్ కన్ఫర్మెంట్‌ను వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ రాయడంపై ఆయన స్పందించారు. పేదలకు సేవ చేయడం చంద్రబాబుకు నచ్చదని.. అందుకే ప్రతీ విషయంలోనూ లేఖలు రాస్తున్నారని బొత్స మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు ఎక్కువగా పోటీ చేసిన చోటే అధికారులను బదిలీ చేశారని.. అందువల్లే అల్లర్లు చెలరేగాయని బొత్స వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లు ప్రజల వద్దకే పాలన అందించామని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి వాలంటీర్ల వ్యవస్థ మంచి పేరు తెచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం వాలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని బొత్స తెలిపారు. 

Similar News