Renu Desai : అమ్మా రేణూ మీ మాజీకి చెప్పు అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Update: 2023-08-11 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే బ్రో ఈ సినిమా లో పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారంటూ గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలా సినిమాలలో తన క్యారెక్టర్ ను క్రియేట్ చేసి పవన్ సంబరపడుతున్నాడు అంటూ మంత్రి చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా, రేణూ దేశాయ్ పోస్టుపై అంబటి రాంబాబు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు ” అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని! ” అని రాసుకొచ్చారు. అలాగే, వైసీపీ కార్యకర్తల, సోషల్ మీడియా టీమ్స్ కూడా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తుండడం గమనార్హం.

Tags:    

Similar News