మంత్రి అంబటికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్

మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది....

Update: 2024-05-23 13:39 GMT

దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వేళ సత్తెనపల్లిలో పలు చోట్ల రిగ్గింగ్ జరిగిందని, అక్కడ రీపోలింగ్ నిర్వహించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ కోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన ధర్మాసనం అంబటికి షాక్ ఇచ్చింది. అంబటి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కాగా మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. సత్తెనపల్లి 236, 237, 253, 254 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో కొందరు రిగ్గింగ్ కు పాల్పడ్డారని మంతి అంబటి ఆరోపించారు. ఆయా వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టును అంబటి ఆశ్రయించారు. 

Similar News