విద్యార్థిని ఆత్మహత్యపై'మహిళా కమిషన్' సీరియస్.. స్కూలుకు నోటీసులు

Update: 2022-01-31 09:07 GMT

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో విజయవాడకు చెందిన విద్యార్థిని దీక్షిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఎవరికీ చెప్పుకోలేక మరణమే శరణ్యమని నిర్ణయం తీసుకున్న విద్యార్ధిని దీక్షితగౌరి మానసిక వేదనను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈమేరకు బాలికల్లో మానసిక ధైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారా.. లేదా..అని  సోమవారం మృతురాలు చదివిన విజయవాడ ఫిడ్జ్ స్కూలు యాజమాన్యానికి మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.

అలాగే చిన్నారుల శరీర భాగాలను తాకడం వెనుక దురుద్దేశాలను పసిగట్టేందుకు వారికి తరగతి గదుల్లో అవగాహన చేయాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న చర్యలేంటని.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రిత్వ కార్యాలయాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వివరణ కోరారు. బాలికలకు వివిధ అంశాలపై మానసిక స్థైర్యం, ధైర్యం నింపేందుకు ప్రతి పాఠశాలలో కౌన్సిలర్ల నియామకం తప్పనిసరని.. ఆ మేరకు చర్యలు చేపట్టాలని మహిళా కమిషన్ తరఫున సూచనలతో  ఆదేశాలు జారీచేశారు.

Tags:    

Similar News