Breaking: హైకోర్టుకు పిన్నెల్లి.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్

పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు...

Update: 2024-05-23 10:41 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలింగ్ బూత్‌లో  ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ చేస్తారనే సమాచారంలో పోలీసులకు చిక్కుకుడా పరారీలో ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు బుధవారం నుంచి పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.

కాగా ఏపీలో 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ మాచర్లలో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాల్వాయి గేట్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఈవీఎం మెషిన్లను ధ్వంసం చేశారు. బూత్ అధికారులను దుర్భాషలాడారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పై సైతం దాడి చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి పిన్నెల్లి కోసం గాలిస్తున్నారు. ఈ ఎపిసోడ్ నడుస్తుండగానే పిన్నెల్లి ట్విస్ట్ ఇచ్చారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

Similar News