Breaking: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరో బిగ్ షాక్

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది....

Update: 2024-05-24 14:08 GMT

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు అయినా ఆయన కదలికపై హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ మేరకు పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల కౌంటింగ్ రోజు మాచర్ల వెళ్లవద్దని ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతిచ్చింది. వచ్చే 6 నెలలు పాటు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధి దాటి వెళ్లొద్దని సూచించింది. కేసుకు సంబంధించి మీడియాలో సైతం మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది. కేసుపై సాక్షులతో మాట్లాడడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది.

కాగా ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ బీభత్సం సృష్టించారు. పోలింగ్ సిబ్బందిని దుర్భాషలాడుతూ ఈవీఎం మెషిన్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఎన్నికల సంఘానికి పోలింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఈసీ ఆదేశించింది. దీంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో హైకోర్టును పిన్నెల్లి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో పిన్నెల్లిపై జూన్ 5 వరకూ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News