మంగళగిరిలో లోకేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా: నారా భువనేశ్వరి

రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకకూడదు, గత అయిదేళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు.

Update: 2024-05-10 15:23 GMT

దిశ, మంగళగిరి: రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకకూడదు, గత అయిదేళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో తనయుడు లోకేష్‌తో కలిసి రచ్చబండ సభలో గురువారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మహిళలంతా నాకు అండగా నిలిచారు. వారి స్పూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాను. గత అయిదేళ్లుగా అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో అవస్థలు పెట్టింది, స్వేచ్చ,స్వాతంత్యాలు ఓటుతోనే వస్తాయి, అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అన్నారు.

గత అయిదేళ్లుగా ఎంతో మంది కార్యకర్తలు తమ జీవితాన్ని త్యాగం చేశారు, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కొందరు నాయకులు వెళ్లిపోయినా కేడర్ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపించారు, వారి కష్టాన్ని మర్చిపోం, వారందరినీ కన్న బిడ్డల్లా చూసుకునే బాధ్యత నాది. ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి. రాష్ట్రవిభజన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారు. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబానికి తండ్రిలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు కావాలి. మీ ఓటు తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేష్‌ను స్థానిక ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనేశ్వరి కోరారు.

Read More..

బాబాయ్ కోసం పిఠాపురానికి రామ్ చరణ్, సురేఖ.. సడన్‌గా పర్యటన ఖరారు 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News