Leopard Roaming in Tirupati: తిరుపతిలో మరోసారి చిరుత కలకలం..

తిరుపతి జిల్లాను చిరుతల భయం వెంటాడుతూనే ఉంది.

Update: 2024-05-25 09:35 GMT

దిశ వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాను చిరుతల భయం వెంటాడుతూనే ఉంది. గతంలో చిరుతలు సృష్టించిన అలజడి నేటికీ కనుల ముందు మెదులుతూనే ఉంది. అయితే తాజగా మరోసారి తిరుపతి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలోని వడమాలపేట మడలం, బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది.

నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రమానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు.   

Similar News