AP News:పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించిన లాయర్లు..కారణం ఏంటంటే!

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని గత వంద రోజులుగా న్యాయవాదులు ప్రశ్నిస్తున్న ఏ రాజకీయ పక్షాలు స్పందించలేదని,

Update: 2024-05-09 09:43 GMT

దిశ,పిఠాపురం:ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని గత వంద రోజులుగా న్యాయవాదులు ప్రశ్నిస్తున్న ఏ రాజకీయ పక్షాలు స్పందించలేదని, టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ముందుకు వచ్చి తాము అధికారం చేపట్టిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పడం హర్షనీయమని పిఠాపురానికి చెందిన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ మేరకు కూటమి పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓటు వేయాలని ర్యాలీ నిర్వహిస్తున్నామని న్యాయవాది నాగేష్ తెలిపారు.

కాకినాడ జిల్లా పిఠాపురం కోర్టు నుంచి న్యాయవాదులు గురువారం ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది నాగేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నీతి ఆయోగ్‌, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం తెమ్మని చెప్పిందని వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కవర్ పేజీని వాడుకుని జగన్ లోపల పేజీలన్నీ తమకు నచ్చిన విధంగా రాసుకుని ప్రజలకు అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా నాగేష్ అన్నారు.వివిధ నియోజకవర్గాల న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Read More..

Interesting Scene: ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటున్న నేతలు.. ఫొటోలు వైరల్ 

Similar News