AP Skill Development Case: నిందితుడు భాస్కర్ అరెస్ట్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

Update: 2023-03-09 13:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్‌ను సీఐడీ పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు. సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందన్న కోణంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భాస్కర్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనను నోయిడా నుంచి విజయవాడ తీసుకొచ్చిన భాస్కర్‌కు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే భాస్కర్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ను రెడీ చేశారు. కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో రూ. 241 కోట్ల స్కాం జరిగిందని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.అయితే ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించారని దర్యాప్తులో వెల్లడైనట్లు సీఐడీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. 

Tags:    

Similar News