Vijayawada: ఇంద్రకీలాద్రిపై మరో వివాదం.. ఉద్యోగికి మెమో జారీ

ఇంద్రకీలాద్రిపై మరో వివాదం నెలకొంది. దుర్గగుడి అధికారిక పత్రికలో తప్పులు దొర్లాయి...

Update: 2023-04-15 12:53 GMT

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మరో వివాదం నెలకొంది. దుర్గగుడి అధికారిక పత్రికలో తప్పులు దొర్లాయి. కనకదుర్గ ప్రభలో ఆదిశంకరాచార్య కులాన్ని ప్రస్తావించారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈవో స్పందించారు. తప్పులపై విచారణకు ఆదేశించారు. పత్రిక ఉద్యోగి గంగాధర్‌కు మెమో జారీ చేశారు.

కాగా ఏపీలో బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నారు. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి. అమ్మలగన్న అమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మగా భక్తులు పిలుచుకుంటారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా కొలుచుకుంటుంటారు. భక్తులు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అటువంటి మహిమ గల పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయం పేరును చెడగొట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. నిధులు మంజూరు చేస్తూ ప్రకటన

Tags:    

Similar News