Breaking News: జనసేనకు మరో 10 సీట్లు..!

జనసేన పార్టీకి పొత్తులో భాగంగా మరో పది సీట్లు వచ్చే అవకాశం ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ తెలిపారు...

Update: 2024-02-25 17:00 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 118 మంది అభ్యర్థులను ఖరారు చేయగా అందులో టీడీపీ అభ్యర్థులు 94 కాగా, జనసేన నుంచి ఐదుగురిని మాత్రమే ప్రకటించారు. అయితే తొలి విడతలో జనసేనకు 24 సీట్లు మాత్రమే ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తింది. కనీసం 40 సీట్లలో అయిన జనసేన అభ్యర్థులకు అవకాశం ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై మరో కీలక అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ఇంకో పది మంది జనసేన నేతలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇస్తునట్లు ఆ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తెలిపారు.

అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఖరారు కావడంతో అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కూడా పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, వచ్చే వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీతో పొత్తును అనుసరించి జనసేనకు మరో 10 సీట్లు రావడానికి అవకాశం ఉందని కొణతాల పేర్కొన్నారు


Breaking: టీడీపీకి భారీ షాక్.... కీలక నేతలంతా మూకుమ్మడి రాజీనామా 

Tags:    

Similar News