Breaking: పులివర్తి నాని పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది...

Update: 2024-05-23 11:49 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత రోజు దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. పులివర్తి నానిపై జరిగిన దాడిని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

కాగా ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రోజు తిరుపతి పద్మావతి యూనివర్సిటీ దగ్గర టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్ర పరిచిన ఈవీఎంలను పరిశీలంచేందుకు నాని వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆయనపై, భద్రత సిబ్బందితో పాటు కారుపైనా దాడి చేశారు. ఈ దాడిలో పులివర్తి నానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి వద్ద కూడా కొందరు రెక్కీ నిర్వహించారని.. తమ కుటుంబానికి, తనకు రక్షణ కల్పించాలని పులివర్తి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Similar News