Breaking: రెండు గంటలుగా రైల్వే‌స్టేషన్‌లోనే జన్మభూమి ఎక్స్‌ప్రెస్

Update: 2024-05-26 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలును పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌లోనే రెండు గంటలుగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నల్లొండ జిల్లా విష్ణుపురం వద్ద గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. రైలు తక్కువ స్పీడులో ఉండటంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. రైలు పట్టాలు తప్పిన వెంటనే బ్రేక్ వేసి రైలును నిలిపివేయంతో మరిన్ని బోగీలు పక్కకు పడిపోలేదు.


దీంతో గూడ్స్ రైలుకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగింది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తివేండ్రం వెళ్లాల్సిన శబరి ఎక్స్‌ప్రెస్ రైలును మిర్యాలగూడలోనే నిలిపివేశారు.

Similar News