ఏపీ సీఎస్‌ని తక్షణమే బదిలీ చేయాలి..జనసేన పార్టీ డిమాండ్

వైసీపీ కార్యకర్తగా దిగజారి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

Update: 2024-05-22 12:51 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి:వైసీపీ కార్యకర్తగా దిగజారి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిని, సుమన్ బాబులతో కలిసి కిరణ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉమ్మడి పార్టీల కూటమి అధికారంలోకి రావాలని మార్పు కావాలని ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి సైతం ఏపీకి వచ్చి ఆంధ్రులు ఓట్లు వేశారని ఓటర్లను కొనియాడారు. సీఎస్ గా జవహర్ రెడ్డి ఉన్నాడన్నధైర్యంతో వైసీపీ రౌడీ మూకలు అనేక చోట్ల ఈవీఎం లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారని, దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.

మాచర్ల లో వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా ఈవీఎం ను నేలకేసి కొట్టారని గుర్తు చేశారు. జవహర్ రెడ్డి వ్యవహారం పై ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాశామన్నారు. అలాగే పోస్ట్ ద్వారా ఈసీకి అందేలా పంపామన్నారు. రాష్ట్రంలో 43 వేలకు పైగా పోలింగ్ బూతులు రాష్ట్రంలో ఉంటే అందులో 34 వేల పోలింగ్ బూత్లకు సీసీ కెమెరాలు పెట్టి పోలింగ్ నిర్వహించారని దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహార ప్లానింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు గ్రహించాలన్నారు. ఈవీఎంల తారుమారు వంటివి జరిగితే..నిజమైన ఓటర్లు వేసిన ఓట్లకు విలువ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు రోజున అటు తర్వాత కూడా రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని అందుకే సీఎస్ ను మార్చాలని డిమాండ్ చేశారు.

Similar News