Nadendla Manohar: మద్యపాన నిషేదం అంటే ఇదా..? సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు

Nadendla Manohar Satires On Jagan Liquor ban in Andhra pradesh| వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన

Update: 2022-06-11 13:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: Nadendla Manohar Satires On Jagan Liquor ban in Andhra pradesh| వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరగకపోవడం పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంపూర్ణ మద్యపాన నిషేధంపై సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం ఆదాయాన్ని రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట అంటూ నాదెండ్ల మ‌నోహ‌ర్‌ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట అంటూ మరో సెటైర్ వేశారు. ఇదీ 'స్పిరిటెడ్ విజనరీ' అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో అమలు జాక్ పాట్ అంటూ నాదెండ్ల పంచ్‌లు వేశారు.

Also Read: చిరు బాటలో పవన్.. తిరుపతి నుంచే పొలిటికల్ టూర్

Tags:    

Similar News