AP News:పల్నాడుకు నీరివ్వాలని నేను తాపత్రయపడిన :చంద్రబాబు

పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనం ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచకం పై ఆవేదన, కసి మీలో ఉంది. జగన్ రెడ్డిని ఓడించాలనే ఆవేశం మీలో ఉంది. ఆ ఆవేశం తిరుగుబాటుగా కనిపిస్తుంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

Update: 2024-05-10 15:01 GMT

దిశ, మాచర్ల:పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనం ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచకం పై ఆవేదన, కసి మీలో ఉంది. జగన్ రెడ్డిని ఓడించాలనే ఆవేశం మీలో ఉంది. ఆ ఆవేశం తిరుగుబాటుగా కనిపిస్తుంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. వర్షం కారణంగా ఆయన గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో మాచర్ల రాలేక పోయారు. ఐతే ఒంగోలు చేరుకున్న చంద్రబాబు తన కోసం వచ్చిన ప్రజలనుద్దేశించి లైవ్ లో ప్రసంగించారు. పల్నాడు ప్రాంతంలో పసుపు జెండా నిలబెట్టడం కోసం మన కార్యకర్తలు చేసిన త్యాగాలు మరచిపోలేను. వారు విడిచిన ప్రాణాలను కూడా మరచిపోను.

ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య, జల్లయ్య లాంటి కార్యకర్తలకు ఈ వేదికగా నివాళులర్పిస్తున్న అని చంద్రబాబు చెప్పారు. చంద్రయ్య పీకపై కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామన్నా అతను మాట వినకుండా ప్రాణాలొదిలాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను. ఒక కార్యకర్త పార్టీని ఎంతగా ప్రేమిస్తాడో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పల్నాడు ప్రాంతంలో 30 మంది టీడీపీ కార్యకర్తల్ని ఈ వైసీపీ రౌడీలు పొట్టన పెట్టుకున్నారు. అయినా ఏ కార్యకర్త వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ జెండా పట్టుకుని గర్వంగా తిరుగుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో వైసీపీ రౌడీ మూకల్ని తరిమికొట్టి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బ్రహ్మారెడ్డి గెలుస్తున్నారు. పల్నాడులో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాను. అభివృద్ధే ధ్యేయంగా పని చేసే మరో నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు మేలు చేయాలి.

నీళ్ళిచ్చి ప్రతి ఎకరాకు సస్యశ్యామలం చేయాలని తపిస్తున్నారు. వారికి తోడ్పాటు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు. పల్నాడు ప్రాంతానికి నీరు ఇవ్వలేకపోయారు. ఉద్యోగాలివ్వలేదు. పరిశ్రమలు లేవు, కనీసం రోడ్లు కూడా వేయలేకపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గోదావరి నీరు కృష్ణా డెల్టాకు తెచ్చి సాగర్ కుడి కాలువకు తేవాలని ప్రయత్నించాం. వైకుంఠపురం బ్యారేజీ కట్టి రైట్ మెయిన్ కెనాల్ కి నీరివ్వాలని ప్రణాళికలు రూపొందించాం. దాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద వరికపుడిసెల వద్ద లిఫ్ట్ మంజూరు చేశాం. నిధులు కూడా కేటాయించాం. దాన్ని జగన్ రెడ్డి రద్దు చేసి మరోసారి పునాదులు వేసి ప్రాజెక్టుని పాడు చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News