స్కూల్ బిల్డింగులకు వైసీపీ రంగులు వేస్తే చదువు వస్తుందా?:చంద్రబాబు నాయుడు

గుంటూరు మిరపకాయ సత్తా ఏంటో చూపించారు. గుంటూరు ర్యాలీ అదుర్స్. మీ జోష్ చూస్తే...చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం గుంటూరు ప్రజాగళం సభలో పాల్గొన్నారు.

Update: 2024-05-02 08:56 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు: గుంటూరు మిరపకాయ సత్తా ఏంటో చూపించారు. గుంటూరు ర్యాలీ అదుర్స్. మీ జోష్ చూస్తే...చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం గుంటూరు ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు మీరు పడిన బాధలు, ఇబ్బందులతో మీరందరు రోడ్డుపైకి వచ్చారు. చిన్నపిల్లలను తండ్రులు భుజాలు పైకి ఎక్కించుకొని వచ్చి ఆ బిడ్డల బాధ్యతను నాకు అప్పగించారు. ఒకసారి నాయకుడిపై నమ్మకం పోతే దాన్ని మరలా సాధించలేరు. ఆడబిడ్డలు మగవారికి ఏ మాత్రం తీసిపోకుండా పోటీ పడి నడిచారు. మీమల్ని చూస్తే సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని అన్నారు.

ప్రతి ఒక్కరు కూటమి మేనిఫెస్టో చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ టీడీపీ, ఉద్యోగాలు సృష్టించడం తెలిసిన పార్టీ. అందుకే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని హామీ ఇచ్చామని చంద్రబాబు అన్నారు. గుంటూరులో ఐటీ టవర్ కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. డీఎస్సీ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ పెడుతాం. పిల్లలందర్నీ బాగా చదివిస్తాం అన్నారు. స్కూల్ బిల్డింగులకు వైసీపీ రంగులు వేస్తే చదువు వస్తుందా? తమ్ముళ్లు అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారు అని మండిపడ్డారు. సాగునీటి వ్యవస్థను, ఆరోగ్య వ్యవస్థను నాశనం చేశారు. అందుకే కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ఇచ్చి ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా వైద్యం చేసుకునే ఏర్పాట్లు చేస్తాం అన్నారు.

గంజాయిపై చూపిన శ్రద్ధ అభివృద్ధి పై చూపి ఉంటే రాష్ట్రం బాగుపడేది అన్నారు. గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. అవునా కాదా? సిటీలో దొరికే గంజాయి సరఫరా ఎవరు చేస్తున్నారు? ఎవరు దీనికి కారణం అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అనుచరులు ఈ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఈ తెలివితేటలు అభివృద్ధి పై చూపితే బాగుండేది. ముస్లిం కాలేజీ వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశాడు. ఆటో నగర్ లో కబ్జాలు చేశారు. ఇన్నర్ రింగురోడ్డు వద్ద 32 ఎకరాలు కబ్జా చేశాడు. ఇంటి పనిమనిషి కొడుకు టీడీపీలో తిరిగాడని దొంగతనం కేసు పెట్టించి చిత్రహింసలకు గురి చేశారు. ఒక రోజు వస్తుంది. దీనికంతటికి పరిష్కారం జరిగే రోజు వస్తుందని పేర్కొన్నారు.

Read More..

డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్ జగన్..చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్

Tags:    

Similar News