ఏబీవీపీ వల్లే ఈ స్థాయిలో ఉన్నా: Venkaiah Naidu

ఏబీవీపీ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు...

Update: 2023-10-29 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏబీవీపీ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతి ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో అమృతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీలో పని చేసిన ప్రస్తుత, పూర్వ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను కూడా ఏబీవీపీలో పని చేశానని వెంకయ్య వెల్లడించారు. తనకు నాయకత్వ లక్షణాలు నేర్పింది ఏబీవీపీనేనని స్పష్టం చేశారు. ఏబీవీపీ ఒక శక్తివంతమైన సంస్థ అని కొనియాడారు. దేశంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విస్తరిస్తోందని వెంకయ్య తెలిపారు. ఏ కులమైనా కుర్చీ ఇవ్వదని, వ్యక్తి నిర్మాణం విద్యతోనే వస్తుందని చెప్పారు. వేదాల్లో సారం తెలుసుకోవాలని సూచించారు. యువత మంచి ఆలోచనలతో రాజకీయాలను అధ్యయనం చేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల భారతదేశం మరింత శక్తివంతంగా ఉండాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

Similar News