Chilakaluripet: ఈ నెల 6న మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం

రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మాత్రం జెట్ స్పీడ్‌లో అమలు చేస్తూనే ఉన్నారు...

Update: 2023-04-01 15:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మాత్రం జెట్ స్పీడ్‌లో  అమలు చేస్తూనే ఉన్నారు. అమ్మఒడి, ఆసరా పింఛన్లు, జగనన్న ఇళ్లు. జగనన్న చేయూత వంటి పథకాలు కొనసాగిస్తూనే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.  ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని  ఏప్రిల్ 6న చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం. టి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ హరింద్ర, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి శోభారాణి,మరియు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు

Tags:    

Similar News