సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు

తాడేపల్లిలోని నివాసంలో ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.

Update: 2023-03-22 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లిలోని నివాసంలో ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ దంపతులు పంచాగ శ్రవణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని కాంక్షించారు. సీఎం జగన్ దంపతులకు మంత్రి రోజా మెంమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం జగన్ దంపతులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. 

ఇవి కూడా చదవండి : Breaking: విజయవాడలో భారీగా బంగారం పట్టివేత..

Tags:    

Similar News