International Telugu Maha Sabhas: మాతృభాష వ్యాప్తి మనందరి బాధ్యత.. గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు

Update: 2024-01-06 10:34 GMT

దిశ వెబ్ డెస్క్: మనిషి తన భావాలను ఎదుటి మనిషితో పంచుకోవడానికి కనుగొనబడిందే భాష. మన దేశంలో వందల భాషలు ఉన్నాయి. కొందరు మాతృభకు విలువిస్తే మరికొందరు మాతృభాషను మాట్లాడడానికి నామూషీగా భావిస్తారు. అందులో ముఖ్యంగా మన తెలుగు వారరిలో చాలంది తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు. కొన్ని పాఠశాలల్లో తెలుగు మాట్లాడం నేరంగా భావించి.. తెలుగు మాట్లాడిన విద్యార్థులను శిక్షిస్తుంటారు. అయితే ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని.. అందుకే మాతృభాష అయినటువంటి తెలుగు వ్యాప్తికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహా సభలు జరుగుతున్న సంగతి అందరికి సుపరిచితమే.

ఇందులో భాగంగా రెండవ రోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో దాదాపు 14వందల భాషలు ఉన్నాయన్న ఆయన.. అందులో 230 భాషలు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తెగలకు సంబందించిన భాషాలని తెలిపారు. కవితలు, కథలు, గేయాలు, సామెతలు ఇలా ఎన్నింటినో తనలో పొదువుకున్న భాష తెలుగు భాషని.. అతి సుందరమైన భాష తెలుగు భాషని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వ్యాఖ్యానిస్తే..దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష దేవరాయలు కీర్తించారని తెలిపారు. అలానే ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే నానుడి తెలుగు భాషకు ఉందని గుర్తుచేశారు. ఇక అవధాన ప్రక్రియ మహత్తర తెలుగు భాష సొంతమన్న ఆయన.. తెలుగు ప్రాచీన భాషగా కూడా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. ఇలాంటి భాషను వ్యాప్తి చేసే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని సూచించారు. 

Tags:    

Similar News