తిరుమల వెళ్తున్న భక్తులకు శుభవార్త.. ఎందుకంటే?

కలియుగ దైవం, దేవదేవుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండగ కావడంతో భక్తులు తమ స్వగ్రామాలకు పయనమయ్యారు.

Update: 2024-01-13 13:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కలియుగ దైవం, దేవదేవుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండగ కావడంతో భక్తులు తమ స్వగ్రామాలకు పయనమయ్యారు.దీంతో తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల సంఖ్య గనణీయంగా తగ్గింది. మాములే రోజుల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల ఎగబడుతుంటారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి తిరుమలలో లేకపోవడంతో ఒక రకంగా ఇది భక్తజనులకు గుడ్ న్యూసే. ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్లో మాత్రం స్వామి వారి దర్శనం కోసం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల స్వామి వారిని 56,588 మంది భక్తులు దర్శించకున్నారు. అందులో 16,574 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.26 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News