Amaravati : పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. రూ.3 వేలకు పెంపు

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది...

Update: 2023-12-15 08:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం బ్లాక్-1లో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. జననన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు అమలుకు ఆమోదం తెలిపారు. ఆరోగ్య శ్రీ చికిత్స పరిధి రూ.25 లక్షల పెంపునకు మంత్రులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సామాజిక పెన్షన్లు రూ.3 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణాన్ని మంత్రులు ఆమోదించారు. లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుల, ఆదాయ ధృవీకణ ప్రతాల మంజూరులో సంస్కరణలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News