గుండెపోటుతో మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి సోమవారం కన్నుమూశారు.

Update: 2024-05-27 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం గుండెపోటుతో సీతాదేవి మృతి చెందారు. సాయంత్రం కదిలిండి మండలం కొండూరుకు సీతాదేవి భౌతికకాయాన్ని తరలించనున్నారు. యెర్నేని సీతాదేవి ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముదినేపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. సీతాదేవి స్వస్థలం కైకలూరు మండలం కోడూరు గ్రామం. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Similar News