Breaking: మాజీ అదనపు ఎస్పీ శివానందరెడ్డికి ఊరట.. అప్పటి వరకు నో అరెస్ట్

మాజీ అదనపు ఎస్పీ విశానందరెడ్డికి ఊరట లభించింది..

Update: 2024-04-01 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ అదనపు ఎస్పీ విశానందరెడ్డికి ఊరట లభించింది. మంగళవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించారు. ఆయనతో పాటు భార్య, కుమారుడిని సైతం అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అరెస్ట్ చేస్తే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది. హైదరాబాద్ బుద్వేల్‌లో రూ. 2,500 కోట్ల విలువైన అసైన్డ్ భూములను అక్రమంగా కొట్టేశారని శివానందరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయనను అరెస్ట్ చేయాలని కర్నూలు వెళ్లి ప్రయత్నాలు చేశారు. అయితే శివనందరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం శివానందరెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని కూడా మంగళవారం అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అంతేకాదు కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Similar News