కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీలో సోమవారం వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి.

Update: 2024-05-27 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సోమవారం వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కాకినాడలో జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా, కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి నిద్రమత్తు కారణమంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News