25న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ఉద్యోగాలకు పరీక్ష.. రూల్స్ ఇవే?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 25న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, గురువారం ప్రకటనలో తెలిపారు.

Update: 2024-05-23 09:00 GMT

దిశ, అమలాపురం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 25న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, గురువారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు స్థానిక భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల నందు ఈ యొక్క ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఆపై ఆలస్యంగా వచ్చిన వారిని గ్రేస్ పీరియడ్‌లో 8.30 గంటల వరకు అనుమతిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 180 మందికి ఓకే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News