దసరా వేడుకలకు సర్వం సిద్ధం : దుర్గమ్మను దర్శించుకున్న హోంశాఖ మంత్రి తానేటి వనిత

దేవీ శరన్నవరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

Update: 2023-09-28 12:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దేవీ శరన్నవరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గత సంవత్సరంలోని లోటుపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది మరింత మెరుగ్గా భక్తులకి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఎప్పుడు ఎప్పుడు దసరా వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణ కటాక్షాలు భక్తులకు ఎప్పుడు ఉండాలని అమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు. హోం శాఖమంత్రి తానేటి వనిత గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన హోంశాఖ మంత్రికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు. హోంమంత్రి వర్యుల వారితో పాటుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇతర నాయకులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు. అనంతరం వీరికి శ్రీ మల్లేశ్వర స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం గౌరవ హోమ్ మంత్రివర్యులు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయముతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగుగా దసరా మహోత్సవములు జరగాలని అమ్మవారిని, స్వామివారిని ప్రార్తించినట్లు తెలిపారు. 

Tags:    

Similar News