ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు: బాలినేని శ్రీనివాసరెడ్డి

టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-20 07:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ఓటర్లలో వీరి శాతం రెండుశాతం మాత్రమేననే విషయాన్ని గుర్తించాలని చెప్పుకొచ్చారు. పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఓటమిపై పార్టీ నాయకత్వం సమీక్షిస్తుందని చెప్పుకొచ్చారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం పట్ల సెటైర్లు వేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచినందుకే టీడీపీ సంబరపడిపోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Also Read..

ఆ పని చేస్తే అసెంబ్లీలోనే ఉరి తీయండి: అచ్చెన్ననాయుడు సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News