Pawan Kalyan పై వ్యాఖ్యల ఎఫెక్ట్: Posani Krishna Murali పై కేసు నమోదు?

ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Update: 2023-10-03 07:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనసేన నాయకుడు కోర్టును ఆశ్రయించారు. జనసేన నేతల పిటిషన్‌పై విచారించిన కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళిపై IPC 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ కేసులో వాస్తవం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : పెడన వారాహి యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర : Pawan Kalyan

Tags:    

Similar News