ఆంధ్రప్రదేశ్‌లో 14 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించిన ఈసీ

2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

Update: 2024-05-02 12:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కాగా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్నికల సంఘం.. గత సంఘటనలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని.. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 14 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా ఈ 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో.. 100% వెబ్‌కాస్టింగ్‌తో పాటు.. భారీ సంఖ్యలో CRPF బలగాలు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13 పోలింగ్ జరగనుండగా పలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Similar News