Breaking: చంద్రబాబుకు నోటీసులు.. ఉద్రిక్తత

తూర్పుగోదావరి జిల్లా బలభద్రపుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకున్నారు....

Update: 2023-02-17 13:29 GMT

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా బలభద్రపుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షో‌కు అనుమతి లేదంటూ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చారు. ముందుకు కదలనివ్వకుండా బలభద్రపురంలో చంద్రబాబు కాన్వాయ్‌కు వాహనాలను అడ్డుపెట్టారు. అంతేకాదు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్ షో మధ్యలోనే చంద్రబాబు వాహనం దిగిపోయారు. ఈ ఘటనపై చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్

సీఎం జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నానని హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగడే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. తన రోడ్ షోకు అనుతిస్తారా లేదా అని ప్రశ్నించారు. ఇది రౌడీ రాజ్యమని.. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామని, అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చంద్రబాబు హెచ్చరించారు. 

Also Read..

పార్టీ ముఖ్యనేతలతో Cm Jagan సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News