విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.. ఆ జిల్లాలో పిడుగులు పడే అవకాశం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీనితో ప్రజలు బయటకి రావడానికే భయపడుతున్నారు.

Update: 2024-04-21 04:18 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీనితో ప్రజలు బయటకి రావడానికే భయపడుతున్నారు. అయితే నేడు భగభగ మండే భానుడు శాంతించనున్నాడు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేటి మధ్యహ్నం నుండి వర్షాలు పడతాయని తెలిపింది.

అయితే అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు పిలుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

Tags:    

Similar News