పిన్నెల్లి ఇన్సిడెంట్..సీఈసీకి నివేదిక అందజేసిన డీజీపీ

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కేసుపై ఎన్నికల సంఘానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు...

Update: 2024-05-22 14:03 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బీభత్సం సృష్టించి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఏపీ నుంచి తెలంగాణకు పారిపోయారు. దీంతో ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివేదికను అందజేశారు. ఈ నివేదికలో సంచలన విషయాలు పొందుపర్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని ఈసీకి డీజీపీ తెలిపారు. ఇప్పటికే పిన్నెల్లిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. పన్నెల్లిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. పిన్నెల్లి పట్టుకునేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో  గాలింపు చర్యలు చేపట్టామని సీఈసీకి డీజీపీ నివేదిక అందజేశారు.

Similar News