వైసీపీ కాపలా కుక్కలుగా పోలీసులు..సీపీఐ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం ఏపీలో పలు చోట్ల అల్లర్లు జరిగాయి.

Update: 2024-05-24 08:15 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం ఏపీలో పలు చోట్ల అల్లర్లు జరిగాయి. ఇదే క్రమంలో తాజాగా పిన్నెల్లి పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సంధర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శుక్రవారం మాట్లాడుతూ..ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక‌ృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, పోలీసులు వైసీపీ కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బదిలీ, సస్పెండ్ అయిన వెధవలు ఖాకీ డ్రెస్‌లు వేసుకోవడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్ధులు పోలీసులు అని దుయ్యబట్టారు.

Similar News