Cm Jagan క్యాంపు కార్యాలయం వద్ద కలకలం

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతులు ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. ..

Update: 2022-11-25 11:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతులు ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. అనూష అనే మహిళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసేందుకు భర్తతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ ఉందా అని ప్రశ్నించారు. లేదని అనూష చెప్పడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కులాంతర వివాహం చేసుకున్నామని, అయితే తన భర్త తరపు బంధువులు తమను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అనూష ఆరోపించారు. గతంలోనూ తమను మట్టుబెట్టేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.

ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా, కుటుంబ పెద్దలకు తెలియజేసినా న్యాయం జరగడం లేదన్నారు. ఆస్తుల కోసం తన భర్త బాబాయ్‌లు హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, తమ కుటుంబాన్ని కాపాడాలంటూ బాధితురాలు వేడుకున్నారు. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, తమ కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ కాపాడాలని వేడుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకునేందుకు అవకాశం కల్పించాలని అనూస కన్నీరు మున్నీరుగా విలపించారు. 


ఇప్పటం గ్రామంపై టీడీపీ, జనసేనవి చౌకబారు రాజకీయం: Ambati Rambabu

Tags:    

Similar News