Y. S. Jagan Mohan Reddy : వైఎస్ జగన్‌‌కు అస్వస్థత .. గంటకుపైగా వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలి మడమ నొప్పితో బాధపడుతున్నారు.

Update: 2023-08-21 10:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలి మడమ నొప్పితో బాధపడుతున్నారు. అయితే నొప్పి తీవ్రమవ్వడంతో సోమవారం విజయవాడ మెుగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గంటకు పైగా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఇకపోతే గత కొంతకాలంగా కాలి మడమ నొప్పితో వైఎస్ జగన్ బాధపడుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News