శ్రీరామ నవమి సందర్భంగా..పలు ఆలయాలను సందర్శించిన సీఎం రమేష్

శ్రీరామ నవమి సందర్భంగా అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి, బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ బుధవారం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Update: 2024-04-17 12:49 GMT

దిశ ప్రతినిధి,అనకాపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి, బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ బుధవారం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్య శ్రీదేవి, కుమారుడు రుత్విక్‌లతో కలిసి బుధవారం ఉదయం అనకాపల్లి రామాయలంలో రాముల వారికి వస్త్రాలు సమర్పించి పూజలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ఆలయాలు సందర్శనలో బిజీ బిజీగా గడిపారు.

అయోధ్యలో రాముల వారు కొలువు తీరడం శుభ సంకేతమని, దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల కోరిక తీరిందని ఆ సందర్భంగా అన్నారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని రామరాజ్యమే ధ్యేయంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పాలన జరుగుతుందని అన్నారు. మూడో పర్యాయం మోడీ ప్రధాని అయితే దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న మరికొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ రాముని ఆశీస్సులతో కేంద్ర , రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఏర్పడతాయని అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి పరమేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Similar News