‘నా సోదరిని వేధించారు’.. గీతాంజలి మృతిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గీతాంజలి మరణం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గీతాంజలి మరణంపై సీఎం జగన్ స్పందించారు.

Update: 2024-04-23 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గీతాంజలి మరణం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గీతాంజలి మరణంపై సీఎం జగన్ స్పందించారు. మంగళవారం విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగ జగన్ మాట్లాడుతూ.. నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని.. వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్యనే నిదర్శనమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని కుట్రలు తట్టుకుని జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా బలమేనని జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మనమీద దాడి చేస్తున్నారంటే విజయానికి మనం చేరువలో ఉన్నామని అర్థమని, వాళ్లు విజయానికి దూరంగా ఉన్నారు కాబట్టే మనపై దాడి చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఎవరైనా వేధింపులకు గురైతే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అటు వైపు చంద్రబాబు, దత్తపుత్రుడు ఇటు వైపు మీ జగన్ ఒక్కరే కనిపిస్తారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబు, దత్తపుత్రుడి కుట్రల మీద అని కీలక వ్యాఖ్యలు చేశారు.


Similar News