బీజేపీ విమర్శలకు సీఎం జగన్ కౌంటర్

బీజేపీ అగ్రనేతలు వరుస పెట్టి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-06-12 09:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ అగ్రనేతలు వరుస పెట్టి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు వైసీపీలోని ఎమ్మెల్యేలు కౌంటరో ఇస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఏనాడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడని జగన్ పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన బహిరంగ సభలో బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు బీజేపీ అండగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పుకొచ్చారు. జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ‘జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు... అయినా పర్వాలేదు. నేను ప్రజలనే నమ్ముకున్నాను. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే నా బలం’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

ఇకపోతే ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రిర అమిత్ షాలు ఏపీలో పర్యటించారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరిస్తూనే వైసీపీ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నాలుగేళ్ల జగన్ పాలనలో అంతులేని అవినీతి జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎం వైఎస్ జగన్ పేరు చెప్తూ మరీ ఘాటు విమర్వలు చేశారు. ఈ పరిణామాలతో సీఎం జగన్ కౌంటర్ ఇవ్వకతప్పని పరిస్థితి.

Similar News