గణపవరం CPF ఫ్యాక్టరీ మూసివేత..రోడ్డున పడ్డ ఉద్యోగులు

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లెలో వున్న సీపీఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్లు చేపలు, రొయ్యల మేతల తయారీ పరిశ్రమ ను బుధవారం మూసివేశారు.

Update: 2024-05-23 10:23 GMT

దిశ, గణపవరం:పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లెలో వున్న సీపీఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్లు చేపలు, రొయ్యల మేతల తయారీ పరిశ్రమ ను బుధవారం మూసివేశారు. 2016లో థాయిలాండ్ కు చెందిన సీపీఎఫ్ కంపెనీని గణపవరం మండలం సరిపల్లెలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించిన కొద్ది కాలంలోనే లాభాలతో ఫ్యాక్టరీని నడిపారు. థాయిలాండ్‌కు చెందిన ఈ కంపెనీ ఆకస్మికంగా మూసివేయడంతో వందలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దేశవ్యాప్తంగా ఫిష్ ఫీడ్ పరిశ్రమ నష్టాల్లో ఉందని యాజమాన్యం సాకుగా చూపి సరిపల్లె ఫ్యాక్టరీ మూసివేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

దేశంలో ఉన్న సీపీఎఫ్ గ్రూప్ ఫ్యాక్టరీలు అన్ని నడుస్తున్నాయి. సరిపల్లె ఫ్యాక్టరీ మూసివేయడంతో దారుణమని వారు వాపోతున్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం పని చేసే ఉద్యోగులకు ఏ విధమైన ఉద్యోగ భద్రత కల్పించలేదని వారు అంటున్నారు. బుధవారం నుంచి ఫ్యాక్టరీ గేటుకు తాళాలు వేసి అందులో పనిచేసే ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి రానివ్వకుండా చేసిందని ఆరోపించారు. జిల్లా అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సి పి ఎఫ్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కోరుతున్నారు.

Similar News